కీరవాణిపై ఏఆర్ రెహమాన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

కీరవాణిపై ఏఆర్ రెహమాన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి  మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ లో నిలిచినందుకు ఆయన కీరవాణిని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు కీరవాణిని తక్కువగా అంచనా వేశారని, 2015లో కీరవాణి రిటైర్ అవ్వబోతున్నట్టు కూడా వార్తలు వచ్చినట్టు రెహమాన్ చెప్పారు. కీరవాణి గొప్ప సంగీత విద్వాంసుడని, కానీ ఆయన్ని కూడా ఒకప్పుడు పట్టించుకోలేదన్నారు. ఆ టైంలో ఆయన సంగీతాన్ని విడిచిపెట్టి, రిటైర్ అవ్వాలని అనుకున్నాడని తెలిపారు. కానీ నిజానికి కీరవాణి కెరీర్ అప్పుడే మొదలైందన్నారు. ఇదే విషయాన్ని తన స్టూడెంట్స్ కు కూడా చెబుతానన్న రెహమాన్.. కెరీర్ ముగిసిపోయింది అనుకున్న తరుణంలో కొత్త ఆశలతో ఎలా ముందుకు సాగుతుందో ఆయన్ని చూస్తే తెలుస్తుందని రెహమాన్ స్పష్టం చేశారు.

1990 లో తెలుగు సినిమా కల్కితో కీరవాణి సంగీత రంగ ప్రవేశం చేసారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. 1991లో రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణ క్షణం సినిమాతో కీరవాణి స్వరకర్తగా పేరు తెచ్చుకున్నారు. మూడు సంవత్సరాల తరువాత మహేష్ భట్ క్రిమినల్ (1994) ద్వారా బాలీవుడ్ లోకి కీరవాణి అరంగేట్రం చేసాడు.