
ఆస్కార్-విజేత, సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ చెన్నైలో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఫ్యాన్స్.. ఆ కన్సర్ట్ ను ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూశారు. ఈ ఈవెంట్ కోసం పలు ప్రాంతాల నుంచి కూడా చైన్నైకి చేరుకున్నారు. కానీ అంతలోనే ఆ షో రద్దు చేస్తున్నట్టు రెహమాన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. భారీ వర్షం కారణంగా క్యాన్సిల్ చేసినట్టు ఆయన వెల్లడించారు. దాంతో పాటు చెన్నైలో మెగా షోలు, అంతర్జాతీయ ఈవెంట్స్ కోసం మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నానన్నారు. రెహమాన్ పోస్టుకు స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. వారు కోరినట్టే చేస్తామని హామీ ఇచ్చారు.
I hope and pray that ..with the help of our government..we construct the next level infrastructure for art,mega shows and international experiences for Chennai #SafetyFirst #rain-resistant #sun-resistant #cluttterfreeparking #notrafficjams https://t.co/8QpwN56mYs
— A.R.Rahman (@arrahman) August 12, 2023
ఆగస్టు 12న చెన్నై లో మ్యూజికల్ కన్సర్ట్ కు హాజరు కానున్నానని, చాలా కాలం తర్వాత మీ అందరినీ చూడడానికి సంతోషిస్తున్నానని రెహమాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సంగీత కచేరీ అనుభవాన్ని పొందేందుకు ముందుగానే మీ సీట్లను బుక్ చేసుకోవాలని కోరారు. ఇలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన మరో పోస్టు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నిరంతర వర్షాల కారణంగా కచేరీని క్యాన్సిల్ చేస్తున్నామని, అభిమానుల భద్రత నిమిత్త దీన్ని తిరిగి షెడ్యూల్ చేయడం మంచిదని భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా అన్నారు. దాంతో పాటు వర్షానిక పాడైన కన్సర్ట్ పరిసరాలు, అక్కడ వానలో తడిసిపోయిన, బురదలో ఉన్న సామాగ్రి, కుర్చీలు కనిపించాయి.
ఆ తర్వాత చెన్నైలో మెగా షోలు, ఇతర ఈవెంట్ ల కోసం మౌలిక సదుపాయాలపై రెహమాన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ పోస్టుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దానికి సమాధానమిస్తూ.. హోటళ్లు, ల్యాండ్‌స్కేపింగ్, ఫుడ్ కోర్టులు, ఇతర సౌకర్యాలతో త్వరలో ECR లో కలైంజర్ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.
Chennai will soon fulfil this long-felt aspiration!#KalaignarConventionCentre to be established on #ECR, will be a world-class facility that can host large format concerts, performances, events, exhibitions and conventions.
— M.K.Stalin (@mkstalin) August 12, 2023
With iconic landscaping, hotels, food courts,… https://t.co/NiXtNntTzp