'అరేబియా కడలి' స్ట్రీమింగ్.. 'తండేల్'ను గుర్తుచేస్తున్న ఈ సిరీస్ ప్రత్యేకతలేంటి?

'అరేబియా కడలి' స్ట్రీమింగ్.. 'తండేల్'ను గుర్తుచేస్తున్న ఈ సిరీస్ ప్రత్యేకతలేంటి?

ఇటీవల విడుదలైన 'కింగ్ డమ్' మూవీలో హీరో విజయ్ దేవరకాండ బ్రదర్ గా నటించి మెప్పించిన సత్యదేవ్.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో మెప్పిస్తున్నారు. అదే ' అరేబియా కడలి' .  వి. వి సూర్యకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ  సిరీస్ లో హీరోయిన్ గా ఆనంది నటించింది. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.  

కథాంశం.. 
విశాఖ  జిల్లాలో మత్స్యవాడ, చేపలవాడ అనే రెండు గ్రామాలు ఉంటాయి. ఈ రెండు గ్రామాల మధ్య విపరీతమైన వైరం ఉంటుంది. అయితే.. చేపలవాడకు చెందిన బద్రి (సత్యదేవ్), మత్స్యవాడకు చెందిన గంగ(ఆనంది) ప్రేమించుకుంటారు. ఆ విషయం తెలిసిన గంగ తండ్రి వాళ్లని విడదీయాలని చూస్తాడు. మరోవైపు చేపల వేటకు సరైన సదుపాయాలు లేకపోవడంతో రెండు ఊళ్ల ప్రజలు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంతో బద్రితోపాటు కొంతమంది గుజరాత్‌‌‌‌కు వెళ్లి చేపలు వేటాడే పనిలో చేరుతారు. కానీ.. అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో ఆ దేశ ఆర్మీ వీళ్లని జైల్లో పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు ఎలా బయటికి వచ్చారు? తెలుసుకోవాలంటే సిరీస్‌‌‌‌ చూడాలి.

 ' తండేల్' మూవీని గుర్తున్న సిరీస్..
అయితే ఈ ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ' తండేల్' మూవీని గుర్తు చేస్తుంది. ఈ రెండింటిలోని కథాంశం ఒకటేలా అనిపిస్తున్నా.. వాటి మధ్య పోలికలు ఉన్నాయి.  తండేల్ సినిమాలో  చేపల వేటకు వెళ్లిన భారతీయ మత్యృకారులు పాకిస్తాన్ కోస్టు గార్డులకు చిక్కడం. వారిని ఇండియాకు తీసుకురావడానికి ఇక్కడి వారు ప్రయత్నిండం జరుగుతుంది. కానీ అరేబియా కడలిని రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని,  రెండు గ్రామల మధ్య వైర్యాన్ని సమాంతరంగా చూపించారు దర్శకుడు క్రిష్. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కించారు.

ఈ 'అరేబియా కడలి' వెబ్ సిరీస్ ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై వై .రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు  నిర్మించారు. సత్యదేవ్ పాత్ర, నటన ఈ సిరీస్ లో హైలెట్ గా నిలిందంటున్నారు అభిమానులు. ఉత్తరాంధ్ర యాస అద్భుతంగా ఉందంటున్నారు. ఇక గంగ పాత్రలో ఆనంది సహజంగా నటించిన మెప్పించారు. నాజర్, పూనమ్ బజ్వా, రవివర్మ, వంటి సీరియన్ నటులు తమ ప్రాతకు న్యాయం చేసి ఈ సిరీస్ కు బలాన్ని చేకూర్చారని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.