
షాంఘై: ఇండియా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. వరల్డ్‌కప్ స్టేజ్–2లో అదరగొట్టింది. ఒజాస్ దేవ్తలేతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి కాంపౌండ్ మిక్స్ టీమ్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి–ఒజాస్ 156-–155తో టాప్‌సీడ్ కొరియా జోడీ కిమ్ జోంగ్–హో-ఓహ్ యోహ్యూన్‌ను ఓడించారు. ఇండియా జోడీకి ఇది వరుసగా రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. గత నెలలో అంటాల్యాలో జరిగిన వరల్డ్‌కప్ స్టేజ్–-1లోనూ మెడల్‌ను సాధించారు. 117–-117తో ఆఖరి రౌండ్‌ను మొదలుపెట్టిన జ్యోతి పర్ఫెక్ట్ టెన్ సాధించడంతో గోల్డ్ సొంతమైంది. ఇక మెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్‌లో ప్రథమేశ్ జవ్కార్ సంచలనం సృష్టించాడు. వరల్డ్ నంబర్‌వన్‌కు షాకిస్తూ కెరీర్‌లో తొలి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో మాజీ చాంపియన్ మైక్ ష్లోసెర్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. టైటిల్ ఫైట్‌లో 19 ఏళ్ల ప్రథమేశ్ 15 బాణాల్లో ఒక్క పాయింట్ మాత్రమే చేజార్చుకున్నాడు. తొలి నాలుగు రౌండ్లలో ఇద్దరు ఆర్చర్లు 29 ఆల్‌తో నిలిచారు. అయితే ఐదో రౌండ్‌లో ష్లోసెర్ 9 పాయింట్లే నెగ్గడంతో ప్రథమేశ్‌కు గోల్డ్ ఖాయమైంది. విమెన్స్‌లో అవ్నీత్ కౌర్ బ్రాంజ్ మెడల్ సాధించింది.