అర్ధశతాబ్దం సినిమా ట్రైలర్ రిలీజ్

అర్ధశతాబ్దం సినిమా ట్రైలర్ రిలీజ్

అర్ధశతాబ్దం మూవీ ట్రైలర్ ఆహాలో రిలీజ్ అయ్యింది. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ఈ విశాల సృష్టిలో మ‌నిషి క‌న్నా ముందు ఎన్నో జీవ‌రాశులుండేవి. ఒకానొక రాక్ష‌స ఘ‌డియ‌లో మానవ జాతి పుట్టుక సంభ‌వించింది’ అని శుభ‌లేఖ సుధాక‌ర్ చెప్పే డైలాగ్‌లో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. 

తెలంగాణ‌లో కుగ్రామ మూలాల్లోని రాజ‌కీయాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిన‌ట్లు ట్రైలర్‌ లో తెలుస్తోంది. మన పక్కన ఉండేవాడు మన కులం కాకపోయినా పట్టించుకోవలసిన అవసరం లేదు... కానీ మన బిడ్డ పక్కలో ఉండేవాడు మనవాడే అయ్యుండాలనే డైలాగ్ ఈ ట్రైలర్ కి మరో హైలెట్.

ఈ నెల 11వ తేదీన ఆహాలో అర్ధశతాబ్దం సినిమా విడుదల చేయనున్నారు.