విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారా? నిజమా..

విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారా? నిజమా..

యువతకు, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అందుకోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఈ లింక్ పై క్లిక్ చేసి, వారి వ్యక్తిగత వివరాలు సమర్పించాలని కోరుతూ ఓ లింక్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ తరహా వార్తలపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. అవన్నీ ఫేక్ అని తేల్చింది. అలా వచ్చే ఏ మెసేజ్ లను ఎవరూ నమ్మొద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండండంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి బోగస్ వెబ్‌సైట్‌లను నమ్మి మోసపోవచ్చని సూచించింది

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న మెసేజ్‌ను ఫేక్ అని చెబుతూ.. PIB ట్విట్టర్ ద్వారా స్పందించింది. యువత కోసం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని, సూచించిన లింక్‌పై క్లిక్ చేసి, దాన్ని బుక్ చేసుకోవడానికి, వ్యక్తిగత వివరాలను అడిగే వారిని నమ్మొద్దంటూ హెచ్చరించింది.

https://twitter.com/PIBFactCheck/status/1647170735734161408