
గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం అల్విన్ కాలనీ డివిజన్ లోని ఫేజ్–1,2, తులసీనగర్, ధరణినగర్, చక్రధారినగర్, వెంకట పాపయ్య నగర్, కాకతీయనగర్, పంచమి కాలనీ, ఎల్లమ్మ బండ కాలనీ
శేరిలింగంపల్లి డివిజన్లోని పాపిరెడ్డినగర్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు.