మెస్సీ మాయాజాలం..ఆస్ట్రేలియాపై అర్జెంటీనా విజయం

మెస్సీ మాయాజాలం..ఆస్ట్రేలియాపై అర్జెంటీనా విజయం

నాకౌట్లో అర్జెంటీనా అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అర్జెంటీనా తరపున మెస్సీ,  జూలియన్ అల్వారెజ్ గోల్స్ సాధించారు. అద్భుత గోల్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెస్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

మెస్సీ అదుర్స్..

ఫస్టాఫ్లో అర్జెంటీనా దూకుడును ప్రదర్శించింది. ఆస్ట్రేలియా గోల్ పోస్టుపై పలుమార్లు దాడులు చేసింది. అయితే అర్జెంటీనా దూకుడుతో ఆస్ట్రేలియా డిఫెన్స్లోకి వెళ్లింది. ఈ సమయంలో మెస్సీ అద్భుతమైన గోల్తో జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. 35వ నిమిషంలో గోల్ కొట్టాడు. తొలి అర్థభాగంగా ముగిసే సమయానికి అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 

సెకండాఫ్లోనూ దూకుడు..

సెకండాఫ్లోనూ అర్జెంటీనా మరింత జోరుగా ఆడింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే జులియన్ అల్వారెజ్ గోల్ కొట్టాడు.  57వ నిమిషంలో అతను గోల్ సాధించడంతో...అర్జెంటీనా ఆధిక్యం 2–0కు చేరుకుంది. దీంంతో ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో 77వ నిమిషంలో ఆసీస్ ఆటగాడు క్రెయిగ్ గుడ్ విన్ కొట్టిన షాట్ ప్రత్యర్థి ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ ముఖానికి తాకి ఆర్జెంటీనా గోల్ పోస్ట్లో పడింది. దీంతో ఆ జట్టు సెల్ఫ్ గోల్ చేసుకుంది. దీని కారణంగా స్కోరు 1–2కు తగ్గింది. అయితే ఆస్ట్రేలియాకు అర్జెంటీనా మరో గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన డిఫెన్స్తో ఆసీస్ ను నిలువరించింది. చివరకు  అర్జెంటీనా 2–1తో గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా అర్జెంటీనా తర్వాత మ్యాచ్లో  నెదర్లాండ్స్తో ఆడనుంది.