బషీర్బాగ్, వెలుగు: ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టుకు హాజరుపర్చారు. ప్రస్తుతం ఆయనపై నమోదైన మొత్తం ఐదు కేసుల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టగా, ఆ కేసులన్నిటిలోనూ పీటీ వారెంట్‌లకు అనుమతి మంజూరు చేసింది. రవిపై ఇటీవలే మరో మూడు కొత్త కేసుల్లో కూడా పీటీ వారెంట్‌లు జారీ చేయడానికి కోర్టు అనుమతి తెలిపింది.
ఇదిలా ఉండగా, ఇమ్మడి రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ పై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, కోర్టు తదుపరి విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది.
