
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌లో ‘పేపర్‌బాయ్’ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన చిత్రం ‘అరి’. శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈనెల 10న సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిసి ఓ డిఫరెంట్ థ్రిల్లర్ ఈ మూవీ ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒక లైబ్రరీ, అక్కడ రివీల్ అయ్యే ఏడు జీవితాలను ఆసక్తిరేపేలా ఇందులో చూపించారు. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్‌తోపాటు సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి పాత్రలను చూపిస్తూ, అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది.