శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరేస్తం : అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరేస్తం :  అరికెపూడి గాంధీ

మాదాపూర్, వెలుగు :  శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వివేకానందనగర్​లోని తన ఇంటి నుంచి సెగ్మెంట్​లోని  డివిజన్లలో  ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.