
Anthem Biosciences IPO: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ జోరును కొనసాగిస్తున్న వేళ ఐపీవోల రాక కూడా లాభదాయకంగానే ఉంది. నేడు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో ప్రీమియం లిస్టింగ్ చేయటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆంథెమ్ బయోసైన్సెస్ కంపెనీ గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఐపీవో షేర్లు ఇష్యూ ధర కంటే 27 శాతం ప్రీమియం రేటు రూ.723.05 వద్ద ఎన్ఎస్ఈలో జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.723.10 వద్ద 26.86 శాతం లాభంతో ముందుకెళుతున్నాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.540-570గా ఉంచిన సంగతి తెలిసిందే.
తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.3వేల 396 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విజయవంతంగా సమీకరించింది. అయితే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలోనే జరిగింది. కంపెనీ ఐపీవోలో 5కోట్ల 96 షేర్లను విక్రయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం ఐపీవో జూలై 14 నుంచి జూలై 16 వరకు అందుబాటులో ఉంచబడింది. లాట్ పరిమాణాన్ని 14 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు రూ.14వేల 040 కనీసం పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.
కంపెనీ తన ఉద్యోగులకు లక్ష 58వేల 653 షేర్లను ఒక్కోటి రూ.50 డిస్కౌంటెడ్ రేటుకు అందించింది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.వెయ్యి 016 కోట్లు సమీకరించింది. అయితే గ్రేమార్కెట్లలో అంచనాల కంటే తక్కువగా లిస్టింగ్ కావటం స్వల్పంగా ఇన్వెస్టర్లను ఐపీవో నిరాశకు గురిచేసింది.
కంపెనీ వ్యాపారం..
2006లో స్థాపించబడిన కంపెనీ ఆవిష్కరణ-ఆధారిత, సాంకేతికత-కేంద్రీకృత కాంట్రాక్ట్ పరిశోధన, అభివృద్ధి తయారీ సంస్థ. ఇది ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి, తయారీ ప్రక్రియలను కలిగి ఉన్న పూర్తిగా సమగ్ర కార్యకలాపాలను కలిగి ఉంది. కంపెనీ ప్రోబయోటిక్స్, ఎంజైమ్‌లు, పెప్టైడ్‌లు, పోషక క్రియాశీలకాలు, విటమిన్ అనలాగ్‌లు, బయోసిమిలర్‌లతో సహా ప్రత్యేకమైన ఫెర్మటేషన్ ఆధారిత ఏపీఐలను తయారు చేస్తోంది.