ఖమ్మం సిటీలో డ్రంకన్ అండ్ డ్రైవ్ లో 44 కేసులు నమోదు

ఖమ్మం సిటీలో డ్రంకన్ అండ్ డ్రైవ్ లో 44  కేసులు నమోదు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించి 44 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో  ఆరు కార్లు, రెండు ఆటోలు, 36 టూ వీలర్ల వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

రెండు నెంబర్ ప్లేట్ లేని బైక్స్, రెండు సైలెన్సర్ మార్చిన బైక్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. డ్రైవ్  లో  ఎస్సై లు రవి, రాము, సాగర్, అమీర్ అలీ, వెంకటేశ్వరావు సిబ్బంది పాల్గొన్నారు.