ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి

హాలియా, వెలుగు : ఉచిత వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, సీఐ దేవిరెడ్డి సతీశ్ రెడ్డి సూచించారు.  ఆదివారం హాలియా పట్టణంలోని ఆదిత్య కేర్ హాస్పిటల్ లో నల్గొండ నిమ్స్ హాస్పిటల్, హాలియా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ శిబిరంలో 600 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 

ఆదిత్య కేర్ ఎండీ డాక్టర్ నులక రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈవో గుండా కృష్ణమూర్తి,  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, లయన్స్  క్లబ్ బాధ్యులు చిట్టిపోలు యాదగిరి, నులక వెంకట్ రెడ్డి, వీరమల్ల శ్రీనివాస్, పేలపూడి బాలకృష్ణ, సక్రూనాయక్​, చీదళ్ల లింగయ్య, డాక్టర్లు కీర్తి రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పాల్వాయి వెంకటరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నీరజ తదితరులు పాల్గొన్నారు.