జులై 24న పాల్వంచలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు

జులై 24న పాల్వంచలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్​ స్కూల్​లో ఈనెల 24న జిల్లా అథ్లెటిక్స్​ చాంపియన్​ షిప్​ పోటీలు జరుగనున్నాయని జిల్లా అథ్లెటిక్స్​ అసోసియేషన్​ జనరల్​ సెక్రటరీ కె. మహీధర్​ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదేండ్ల నుంచి 20ఏండ్ల వయసు లోపు వారికి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

 60,100,400 మీటర్ల పరుగు పందెం, లాంగ్​ జంప్, జావెలిన్​ త్రో, స్టాండింగ్​ బ్రాండ్​తో పాటు పలు అంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని ఆగస్టు 3న హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్​ అథ్లెటిక్స్, 7న జరిగే రాష్ట్ర స్థాయి సబ్​జూనియర్​చాంపియన్​ షిప్​ పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. జిల్లాలోని అథ్లెట్లు 24న ఉదయం 8 గంటలకు కిన్నెరసానిలోని కోచ్​ నాగేందర్​కు రిపోర్టు చేయాలని తెలిపారు.