డ్యాం పనులు మొదలు పెట్టిన చైనా.. బ్రహ్మపుత్ర నదిపై రూ.14 లక్షల కోట్లతో ప్రాజెక్టు .. ఇండియాకు తీవ్ర నష్టం !

డ్యాం పనులు మొదలు పెట్టిన చైనా.. బ్రహ్మపుత్ర నదిపై రూ.14 లక్షల కోట్లతో ప్రాజెక్టు .. ఇండియాకు తీవ్ర నష్టం !

ఇండియా, బంగ్లాదేశ్ కు కీలకమైన బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు నిర్మిస్తామని ఇన్నాళ్లు భయపెడుతూ వస్తున్న చైనా అన్నంత పని చేసింది. ప్రపంచంలో అతి పెద్ద డ్యాం ను.. రూ.13 లక్షల 94 వేల కోట్లతో నిర్మిస్తోంది. డ్యాం పనులు మొదలు పెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో టిబెట్ లో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది చైనా. 

టిబెట్ లో యార్లుంగ్ త్సాంగ్పో అని పిలిచే నదిని ఇండియాలో బ్రహ్మపుత్రగా పిలుచుకుంటుంటాం. డ్యాం ప్రారంభ కార్యక్రమానికి చైనీస్ ప్రీమియర్ర లీ క్వియాంగ్ హాజరై ప్రారంభించినట్లు చైనీస్ మీడియా ప్రకటించింది. 2023 డిసెంబర్ లో న్యింగ్షీ సిటీకి సమీపంలో నిర్మాణానికి అనుమతులు లభించగా.. ఇప్పుడు పనులను ప్రారంభించడం గమనార్హం.

ప్రపంచంలోనే అతిపెద్ద హెడ్రో ప్రాజెక్టైన ఈ డ్యాంలో 5 వరుస పవర్ స్టేషన్స్ ఉంటాయి. ఇవి ఒకదానికి ఒకటి అనుసంధానం అయి ఉంటాయి. ఈ ప్రాజెక్టు ఒక్కసారి కంప్లీట్ అయితే.. ఏడాదికి  గంటకు 300 బిలియన్ కిలోవాట్ల ఎలక్టిసిటీ ప్రొడక్షన్ జరుగుతుందని ప్రకటించింది. బ్రహ్మపుత్రనది అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటీ ఇచ్చే ముందు యూటర్న్ తీసుకునే ముందు ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది చైనా.

ఇండియాకు భూకంప ప్రమాదం:

ఇండియా, బంగ్లాదేశ్ కు కీలకమైన నదిపై అంతపెద్ద బ్రిడ్జ్ కట్టడం వలన భవిష్యత్తులో ఇండియా, బంగాల్లో భారీ వరదలు వచ్చే చాన్స్ ఉందని ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చైనా నిర్మించే డ్యాం.. ఇండియా టెక్టానిక్ ప్లేట్లపై ఉందని.. ఈ డ్యాం కారణంగా టెక్టానిక్ ప్లేట్లు కదలటంతో భవిష్యత్తులో భూకంపం సంభవించే ప్రమాదం ఉందని భూకంప నిపుణులు చెబుతున్నారు. 

Also Read:-ఫోన్ పే, గూగుల్ పే లను ఈ రేంజ్లో వాడుతున్నారా.. జేబులో డబ్బులు పెట్టుకోవటం మానేశారేమో !

అదేవిధంగా బ్రహ్మపుత్ర నదిపై భారత్, చైనా మధ్య చరిత్రాత్మక ఒప్పందం ఉంది. ఈ నదీజలాలపై 2002లో తొలిసారిగా 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం ఈ నదికి సంబంధించిన ప్రతి విషయాన్ని భారత్​కు చైనా వెల్లడించాలి. చాలా ఏండ్లుగా కొనసాగిన ఈ ఒప్పందం 2023తో ముగిసింది. తర్వాత ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. 

ఈ క్రమంలో చైనా సూపర్​ డ్యామ్​ను నిర్మాణానికి పూనుకోవడం భారత్​ను టెన్షన్​పెడుతోంది. ఈ డ్యామ్​ భారత్​పాలిట పెనుముప్పుగా మారనున్నది. ఒకవేళ చైనా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే అరుణాచల్​ ప్రదేశ్​ను వరదలు ముంచెత్తుతాయి. చైనా దీనిని వాటర్ బాంబ్​గా ఉపయోగించుకునే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.