
మీరు ఏదైనా కొంటున్నప్పుడు.. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సినపుడు క్యాష్ లో ఇస్తున్నారా..? ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా చెల్లిస్తున్నారా..? ఆల్మోస్ట్ యూపీఐ పేమెంట్స్ లోనే కదా చెల్లిస్తోంది. మనమే కాదు.. ఇండియా వ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రజలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరగటం లేదు. ఎక్కడికి వెళ్లినా ఆన్ లైన్ పేమెంట్స్.. ముఖ్యంగా UPI పేమెంట్స్ చేస్తున్నారు. ఇండియాలో మారిన ఈ ట్రెండ్ కారణంగా.. ప్రపంచంలోనే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశాల జాబితాలో ఇండియా ఫస్ట్ ప్లేస్ కు దూసుకుపోయింది.
ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (IMF) లేటెస్ట్ గా విడుదల చేసిన రిపోర్ట్ ఆధారంగా ఇండియా టాప్ ప్లేస్ లో ఉన్నట్లు వెల్లడించింది. Growing retail Degital payments: The value of interoperability పేరున ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం భారత్ డిజిటల్ చెల్లింపులలో అమెరికా, చైనా తదితర దేశాలను దాటి 1వ స్థానానికి చేరుకుంది.
ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ సిస్టంను 2016 లో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అప్పట్నుంచి భారత ప్రజల లావాదేవీల స్వరూపం మారిపోయింది. ఒకప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లడం.. ఆ తర్వాత మిస్ డ్ కాల్ ఇవ్వటం.. ఆ తర్వాత ఆన్ లైన్.. మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేది. అలా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మనకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నా సరే ఒకే యాప్ లో రిజస్టర్ చేసుకుని చెక్ చేసుకునే సదుపాయం కలిగింది. ఒకే యాప్ లో అన్ని బ్యాంకులతో ట్రాన్జాక్షన్స్ చేసుకునే ఫెసిలిటీ యూపీఐ విధానం ద్వారా వచ్చింది.
నెలకు 18 వందల కోట్ల ట్రాన్జాక్షన్లు:
క్యాష్ ఆధారంగా చేసే పేమెంట్స్ విధానాన్ని డిజిటల్ పేమెంట్స్ సిస్టం పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు వ్యక్తుల నుంచి చిరు వ్యాపారులు, బడా వ్యాపారుల వరకు ఎవరైనా యూపీఐ ద్వారానే లావాదేవీలు నడుస్తున్నాయి. ఛార్జీలు తక్కువగా ఉండటం, సేఫ్, క్విక్ గా ఉండటం కారణంగా అందరూ డిజిటల పేమెంట్స్ కు అలవాటు పడ్డారు.
Also Read:-హనీమూన్ కోసం వింత చేష్ట: పెళ్లిలో విందు వేలం వేసిన వధూవరులు.. గెస్టులకు షాక్
ప్రపంచంలోనే ఎక్కువ లావాదేవీలు ఇండియాలోనే జరుగుతున్నాయి. కేవలం జూన్ నెలలో 24 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్జాక్షన్స్ జరిగాయంటే ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పవచ్చు. ట్రాన్జాక్షన్ల పరంగా ఒక్క నెలలోనే 18 వందల కోట్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది 13 వందల కోట్ల ట్రాన్జాక్షన్స్ తో పోల్చితే చాలా వేగంగా 32 శాతం ట్రాన్జాక్షన్లు పెరిగాయి.
ఇండియాలో మొత్తం 49 కోట్ల 10 లక్షల మంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. 6 కోట్ల 50 లక్షల మంది చిన్న పెద్ద వ్యాపారులు యూపీఐ ప్లాట్ ఫామ్స్ కు కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇంత మంది బ్యాంకుకు వెళ్లకుండా.. బ్యాంకుతో పనిలేకుండా ట్రాన్జాక్షన్స్ జరుపుతున్నారు. ఇండియాలో జరుగుతున్న డిజిటల్ ట్రాన్జాక్షన్స్ లో 85 శాతం యూపీఐ ఆధారంగానే జరుగుతున్నాయి.