హనీమూన్ కోసం వింత చేష్ట: పెళ్లిలో విందు వేలం వేసిన వధూవరులు.. గెస్టులకు షాక్

హనీమూన్ కోసం వింత చేష్ట: పెళ్లిలో విందు వేలం వేసిన వధూవరులు.. గెస్టులకు షాక్

ఎక్కడికైన పెళ్లికి వెళ్తే మొదట అతిధులను ఆహ్వానించడం, పెళ్లి తరువాత భోజనాలు పెట్టడం జరుగుతుంటుంది. అయితే వచ్చిన అతిధులకు ఎలాంటి మర్యాద తగ్గకుండా చూసుకుంటుంటారు. అందులో ఎ ఒక్క వంటకం కూడా తగ్గకుండా వడ్డిస్తుంటారు. ఎందుకంటే పెళ్ళికి వచ్చిన అతిధులను గౌరవించడం పద్ధతి కాబట్టి. 

కానీ   ఓ కొత్త జంట పెళ్లి విందులో మొదటి ప్లేట్‌ భోజనాన్నీ వేలం వేయడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ సంఘటన వేలాది నెటిజన్లను  ఆగ్రహానికి గురిచేసింది. ఇంకా పెళ్లి  మర్యాదలు,  అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విధానం గురించి కూడా చర్చకు దారితీసింది. 

Also Read:- ఫోన్ పే, గూగుల్ పే లను ఈ రేంజ్లో వాడుతున్నారా.. జేబులో డబ్బులు పెట్టుకోవటం మానేశారేమో !

ఎక్స్ అకౌంట్ @turbothadలో షేర్ చేసిన  వీడియో ప్రకారం పెళ్లి తర్వాత ఆకలితో ఉన్న అతిథులను కూర్చోబెట్టి వధూవరులు మొదటి భోజన ప్లేట్‌ను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్లేట్ కొన్న వారికి మాత్రమే ముందుగా భోజనం వడ్డిస్తామని, ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అలాస్కాలో  హనీమూన్ కోసం ఉపయోగిస్తామని వధూవరులు తెలిపారు. అయితే ఒక అతిథి మొదటి ప్లేట్ భోజనం కోసం $1,500 ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ లో సుమారు రూ.1.25 లక్షలు.  

 

అయితే, ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు  కురిపించారు. చాలా మంది ఈ జంట చేసిన పనిని మర్యాద కాదని అంటూ  కామెంట్ చేసారు. ఒక నెటిజన్ కొంతమందికి పెళ్లి అంటే డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే అన్నట్లుగా ఉంది, ఇది బాధాకరం. ఆహారాన్ని అమ్మడం సిగ్గుచేటు అంటూ రిప్లయ్ ఇచ్చారు.  

మరొకరు ఇది కరెక్ట్ కాదు. మీ పెళ్లికి రావడానికి అందరూ డబ్బు ఖర్చు చేసి, టైం కేటాయించుకొని వస్తే వారికి  ఫుడ్  పెట్టడానికి అదనంగా డబ్బు కట్టడం అనేది చాలా దారుణం అని అన్నారు. చాలా మంది మేమైతే పెళ్లి నుండి బయటకు వెళ్లి ఉండేవాళ్లమని అనగా, కొందరు ఇంటికి వెళ్లేటప్పుడు మెక్‌డొనాల్డ్స్ లో తినేవాళ్ళం అని అన్నారు.