తలసేమియా చిన్నారులకు మెడిసిన్, నోట్ బుక్స్ పంపిణీ

తలసేమియా చిన్నారులకు మెడిసిన్, నోట్ బుక్స్ పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగు మట్ల అర్బన్ పార్కులో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం తలసేమియా చిన్నారులకు జిల్లా అటవీశాఖ ఆఫీసర్ సిద్ధార్థ విక్రమ్ సింగ్ మెడిసిన్​తోపాటు నోటు బుక్స్, బ్యాగ్స్​పంపిణీ చేశారు. అంతకుముందు డీఎఫ్ఓ చిన్నారులతో కలిసి వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటారు. 

ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ ఓ నాగేశ్వరరావు, సచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని తదితరులు పాల్గొన్నారు.