అనాథలకు ఆర్థిక సాయం అందజేసిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు

అనాథలకు ఆర్థిక సాయం అందజేసిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు

సూర్యాపేట, వెలుగు : ఆత్మకూరు (ఎస్) మండల పరిధిలోని గట్టికల్ గ్రామానికి చెందిన మోరపాక రాములు, లక్ష్మి దంపతులు, రాములు తండ్రి భిక్షం ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో రాములు– లక్ష్మి దంపతుల పిల్లలు శివ, సాయి అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ కు చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు ఆదివారం మండలం గట్టికల్ గ్రామానికి వెళ్లి చిన్నారులను పరామర్శించి  రూ.1.55 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలైన చిన్నారులకు దాతలు అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. 

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

చండూరు (మర్రిగూడ), వెలుగు : మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు ఇరిగి మల్లయ్య(55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు.  విషయం తెలుసుకున్న నీలకంఠ రామస్వామి ఆలయ చైర్మన్ రాపోలు యాదగిరి.. మృతదేహాన్ని సందర్శించి అంత్యక్రియల కోసం రూ.20 వేలు, మాజీ సర్పంచ్ సబితారెడ్డి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆర్థిక సాయం అందజేసిన వారిలో చిట్యాల యాదగిరిరెడ్డి, చెరుకు లింగంగౌడ్, నర్సింహ, యాదయ్య ఉన్నారు.