ఒక రిప్లయ్ ఇవ్వొచ్చుగా.. గురువుగారు అంటూ తెగ సిగ్గుపడిపోయిన అరియాన

ఒక రిప్లయ్ ఇవ్వొచ్చుగా.. గురువుగారు అంటూ తెగ సిగ్గుపడిపోయిన అరియాన

బిగ్ బాస్ బ్యూటీ అరియానా(Ariyana) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4(Bigg boss season4)లో తన ఆటతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆతరువాత బిగ్ బాస్ OTT(Bigg boss OTT)లో కూడా కనిపించి ఆడియన్స్ ను అలరించింది.  ఇక అడపాదడపా టీవీ షోలలో కనిపించే అరియానా.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన లేటెస్ట్ ఫోటో షూట్స్, షోస్ డీటెయిల్స్ తన ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటారు. 

ఇందులో భాగంగానే తాజాగా తన ఫాలోయర్స్ తో అస్క్ మీ సెషన్ లో ముచ్చటించారు అరియానా. ఫ్యాన్స్ కూడా ఆమెకు అదిరిపోయే ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు తెగ సిగ్గుపడిపోయింది అరియానా. ఇంతకీ ఆ నెటిజన్స్ ఏమడిగాడంటే.. ఆర్ యు డేటింగ్ ఎనీవన్(ఎవరితోనైనా రేలషన్ లో ఉన్నారా)అని అడిగాడు. ఆ ప్రశ్నకి సిగ్గుపడిపోయిన అరియానా లేరు అన్నట్లుగా తల ఊపారు. మీకు థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఒకసారైనా రిప్లై ఇవ్వొచ్చుగా అని మరో ప్రశ్న అడిగాడు ఆ నెటిజన్. దానికి.. ఇప్పుడు ఇచ్చానుగా సంతోషంగా ఉందా గురువు గారు.. అంటూ రిప్లై ఇచ్చారు అరియానా. దీంతో ఆ వీడేమో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.