Arjun Ambati: బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేమ్ అర్జున్ అంబటి రొమాంటిక్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరల్

Arjun Ambati: బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేమ్ అర్జున్ అంబటి రొమాంటిక్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరల్

బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా పూరి జగన్నాధ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పరమపద సోపానం’.జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఎస్.ఎస్.మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

గుడిమెట్ల ఈశ్వర్ సహ నిర్మాత. విడుదల సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా నుంచి ‘చిన్ని చిన్ని తప్పులేవో’అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేశారు. ‘ఈగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ఫేమ్ డేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పృథ్వీ చంద్ర, అదితి బావరాజు పాడారు.

‘‘చిన్ని చిన్ని తప్పులేవో.. నీతో మళ్లీ మళ్లీ చేసుకోనా.. చిలిపి చిలిపి ఆటలేవో నీతో మళ్లీ మళ్లీ ఆడుకోనా.. మనసులోని ఇష్టమంత నీ పేరే పలికేనా ..’అంటూ రాంబాబు గోసాల రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.

ఈ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. ఇక సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. గ్రాండ్ గా జులై 11న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకురానుంది. 

అర్జున్ అంబటి సినిమాల విషయానికి వస్తే.. 

టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 'తెప్పసముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇపుడీ 'పరమపద సోపానం' మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాడనే ఆసక్తి నెలకొంది.