బుడాపెస్ట్ (హంగేరి): తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి, ఆర్. ప్రజ్ఞానంద, ఆర్. వైశాలి.. తొలిసారి జరగనున్న టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీకి ఎంపికయ్యారు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో పాటు ఫ్యాబియానో కరువాన (అమెరికా) కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు.
24 మందితో ఆడనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటివరకు 18 మందిని ఎంపిక చేశారు. వచ్చే నెలలో మరో ఆరుగుర్ని ప్రకటించనున్నారు. నవంబర్ 10 నుంచి 21 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. 24 మందిని నాలుగు గ్రూప్‌లుగా విభజించనున్నారు. బ్లిట్జ్, ర్యాపిడ్, ఫాస్ట్ క్లాసికల్ ఫార్మాట్లలో పోటీలు జరగనున్నాయి. ప్రతి విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తారు.
