వర్క్ బిజీ వల్ల కొంతమందికి రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్లడం కుదరదు. దాంతో రోజూ వాకింగ్ మాత్రమే చేస్తుంటారు. అలాంటివాళ్లు మరింత ఫిట్‌గా ఉండాలి అనుకుంటే దీంతో ఇంట్లోనే హాయిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. దీన్ని పల్స్ఇట్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఇది మణికట్టు, ముంజేయి, ఛాతీ, భుజాల కండరాలను స్ట్రెంథెన్ చేసుకునేందుకు తయారుచేసిన ఒక ప్రత్యేకమైన పరికరం. ఇందులో ఉండే 360 డిగ్రీల హ్యాండ్–క్రాంక్ మెకానిజం వల్ల చేతులతో గుండ్రంగా తిప్పుతూ వ్యాయామం చేయొచ్చు.
►ALSO READ | కొంతమందికి తినేటప్పుడు గొంతులో అన్నం ఇరుక్కుపోతుంటుంది.. కానీ.. ఈ గాడ్జెట్ ఉంటే..
గిటార్ ప్లేయర్స్, వాలీబాల్ లాంటివి ఆడేవాళ్లకు వచ్చే ముంజేతి నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. దీనికి ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. అందులో దాన్ని ఎన్ని రౌండ్స్ తిప్పామనే కౌంట్ కనిపిస్తుంటుంది. దీన్ని మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ వాడుకునేలా తయారుచేశారు. తేలికగా, చిన్నగా ఉండటం వల్ల ఇల్లు, ఆఫీసు, జిమ్.. ఎక్కడైనా వాడుకోవచ్చు. దీన్ని హై క్వాలిటీ మెటీరియల్‌తో తయారుచేశారు.
ధర: 16 వందల 91 రూపాయలు
