ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్ లో నినాదాలు

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్ లో నినాదాలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆందోళనకు దిగారు రైతులు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ... కెనాల్ బ్రిడ్జిపై రైతులు ధర్నా చేస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు రైతులు. రోజూ కూరగాయలు అమ్మే మార్కెట్ దిమ్మెలను కూల్చి ఇంటిగ్రేటెడ్ నిర్మాణం చేపట్టడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు రైతులు. లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.