మల్కాజిగిరిలో ఆయుధాల స్మగ్లర్ అరెస్ట్...2 పిస్టల్స్, తపంచా స్వాధీనం

మల్కాజిగిరిలో ఆయుధాల స్మగ్లర్ అరెస్ట్...2 పిస్టల్స్, తపంచా స్వాధీనం

మల్కాజిగిరి/నేరేడ్​మెట్, వెలుగు: బిహార్ నుంచి తక్కువ ధరకు అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాద్‌‌లో విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ స్మగ్లర్‌‌ను పోలీసులు అరెస్ట్​చేశారు. మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన పర్భన్స్ కుమార్ ప్రస్తుతం చర్లపల్లి భరత్‌‌నగర్‌‌లో నివసిస్తూ కూలీ పనులు చేస్తున్నాడు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లిన ఇతను, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆయుధాల వ్యాపారంపై దృష్టి పెట్టాడు. 

ఇందులో భాగంగా ఈ నెల 10న బిహార్ వెళ్లి, సోను అనే వ్యక్తి వద్ద ఆయుధాలు కొనుగోలు చేశాడు. శనివారం బొల్లారం సాధనా మందిర్ దగ్గర సంచరిస్తుండగా.. ఎస్‌‌ఓటీ మల్కాజిగిరి, బొల్లారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 2 పిస్టల్స్, ఒక డబుల్ బారెల్ తపంచా, 3 మ్యాగజైన్లు, 19 తూటాలు, ఒక ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌‌లో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. అక్రమ ఆయుధాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు  సమాచారం ఇవ్వాలని కోరారు.