ఆర్మీ జాబ్స్ కోసం వెళ్లి ఫుట్‌పాత్‌పై యువకుల నిద్ర

V6 Velugu Posted on Mar 20, 2021

ఉడుపి: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం వెళ్లిన కొందరు యువకులు రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పై పడుకోవడం అందరి హృదయాల్ని తాకింది. ఈ ఘటన కర్నాటక, ఉడుపిలోని మహాత్మా గాంధీ జిల్లా స్టేడియంలో బుధవారం జరిగింది. రిక్రూట్‌‌మెంట్‌కు వచ్చిన యువకులు రోడ్డు పక్కన పడుకొని ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి ప్రమోద్ మాధవరాజ్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. యువకులకు భోజనం, వసతి లాంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఢిఫెన్స్ మంత్రిత్వ శాఖను మాధవ్‌రాజ్ కోరారు. దేశానికి సారథ్యం వహించాలనుకునే యువతతో ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 

Tagged pm modi, photos, viral, tweet, Aspirants, army, Sleep, in karnataka

Latest Videos

Subscribe Now

More News