విధుల్లో చేరడానికి వెళ్లి ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

విధుల్లో చేరడానికి వెళ్లి ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

ఇటీవలే సొంతూరు వచ్చి.. సెలవులు పూర్తి కావడంతో విధుల్లో చేరడానికి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యం కావడం కడప జిల్లాలో కలకలం రేపింది. కలసపాడు (మం) ముదిరెడ్డిపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగీ బైరెడ్డి నాగార్జునరెడ్డి అదృశ్యం అవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు పోలీసులు. 
 
 బైరెడ్డి నాగార్జునరెడ్డి ఉత్తరాఖండ్ బేస్ క్యాంపులో పని చేస్తున్నాడు. సెలవులపై సొంతూరుకు వచ్చిన నాగార్జున రెడ్డి.. ఏప్రిల్1వ తేదీన ఆర్మీలో విధులకు వెళ్తుతున్నట్లు తెలిపి ఇంటి నుంచి బయలుదేరాడు. గడువు ముగుస్తున్నా  విధుల్లో చేరకపోవడంతో ఆర్మీ అధికారులు తండ్రికి ఫోన్ చేశారు. 

అటు విధుల్లో చేరక.. ఇటు ఇంటికీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.