పూంఛ్: దాయాది పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది. జమ్మూ కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ భారత ఆర్మీ జవాన్ చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ప్రాంతాలైన మనకోటె, కృష్ణా ఘాటి సెక్టార్స్‌లో బుధవారం రాత్రి పాకిస్తాన్ మోర్టార్లతో భారీగా ఫైరింగ్ చేసిందని డిఫెన్స్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చామని పేర్కొన్నారు. దాయాది పాక్ సెప్టెంబర్‌లో 47 మార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
