నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ లో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ లో భారీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

హైదరాబాద్: అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్, అగ్నివీర్ అడ్మిన్ అసిస్టెంట్ / స్టోర్ కీపర్ ఎన్ రోల్ మెంట్ కోసం యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ 2024 జనవరి 1 నుంచి మార్చి 10 వరకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) సెంటర్ లో నిర్వహించనున్నారు. టెక్నికల్ (SKT) (AOCవార్డు మాత్రమే), అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ 10వ తరగతి(ఆర్టిసన్ మిలిలేనియస్ వర్క్స్, చెఫ్, స్టీవార్డ్) అగ్నీవీర్ ట్రేడ్స్ మెన్ 8వ తరగతి(హౌస్ కీపర్) కేటగిరి, అత్యుత్తమ  క్రీడాకారులు (ఓపెన్ కేటగిరి) రిక్రూట్ మెంట్ లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. 

బెస్ట్ స్పోర్ట్స్ మెన్ ( ఓపెన్ కేటగిరీ) అభ్యర్థులు స్పోర్ట్స్ ట్రయల్ కోసం 2023 డిసెంబర్ 29 ఉదయం 6 గంటలకు AOC సెంటర్ లోని థాపర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాతినిధ్య వహించిన అత్యుత్తమ క్రీడాకారులు, సీనియర్ లేదా జూనియర్ జాతీయ స్థాయిలో తమ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన వారు.. వ్యక్తిగత ఈవెంట్లలో ఏదైనా పతకం సాధించిన వారు, ట్రాక్ , ఫీల్డ్ ఈవెంట్లలతో సహా అథ్లెటిక్స్ రంగాల్లో టీమ్ ఈవెంట్ 8వ స్థానాలకు చేరుకున్నవారు, స్విమ్మంగ్, డైవింగ్, వెయిట్ లిఫ్టింగ్ వారు సర్టిఫికెట్లతో పాల్గొనాలి. 

అగ్నివీర్ టెక్ కోసం అభ్యర్థులు సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్) లో 10+2 లేదా ఇంటర్మీడియట్ పరీక్సలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండలి. ప్రతి సబ్జెక్టులో 40 శాతం లేదా సైన్స్ (ఫిజిక్స్) లో 10+2 లేదా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(NIOS), ఇండస్ట్రీయిల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (IIT) కోర్సుతో సహా ఏదైనా గుర్తింపు పొందిన స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ లేదా సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ నేషన్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (NSQF) అవసమైన రంగంలో కనీసం సంవ్సతరం కోర్సు  50 శాతం ఉత్తీర్ణత, ఇంగ్లీషు, గణితం, సైన్స్ లో కనిష్టంగా 40 శాతం తో ఐటిఐ లేదా మూడేళ్ల డిప్లొమా నుంచి టెక్నికల్ ట్రైనింగ్ తో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

అభ్యర్థులు సర్టిఫికెట్లు స్క్రీనింగ్ తేదిలో రెండేళ్ల కంటే పాతవి కాకూడదు. అగ్నివీర్ GDకి అవసరమైన విద్యార్హత 10 తరగతి. 45 శాతం మార్కులతో ప్రతి సబ్జెక్టులో 33 శాతం ఉత్తీర్ణత, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్  కలిగిన అభ్యర్థులకు డ్రైవర్ స్థానాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 


ఆసక్తి గల అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ర్యాలీ గురించి మరింత సమాచారం కోసం www.joindianarmy.nic.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులందరూ కోవిడ్ 19 కోసం పూర్తి టీకాలు తీసుకొని ఉండాలి. ఎటువంటి కారణం చెప్పకుండా ర్యాలీని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చు. 

Also Read :- 12 గంటల్లోనే రెండో ప్రమాదం.. కోచ్‌లో చెలరేగిన మంటలు.. 19మందికి గాయాలు