
కరీంనగర్ స్పోర్స్ట్, వెలుగు: కరీంనగర్ లో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు 3,348 మంది అభ్యర్ థులు పాల్గొనాల్సి ఉండగా 2,608 మంది పాల్గొన్నారు. అందులో 250 మంది వైద్య పరీక్షలకు ఎన్నికయ్యారు. అయితే ఏర్పాట్లను ఘనంగా
చేశామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నా.. ర్యాలీకి వచ్చి న అభ్యర్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాక్ మొత్తం బురదమయంగా ఉండడంతో పరుగు
పందెంలో అవస్థలు పడ్డారు.