
హైదరాబాద్ , వెలుగు : ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, ఆస్పత్రులు చెబుతున్న లెక్కలకుమొదట్నుంచి పొంతన కుదరడం లేదు. బకాయిలు ఎన్ని ఉన్నాయనే దానిపై పూర్తి వివరాలను చెప్పాలని, నిధులు విడుదల చేస్తున్నప్పుడు ఏ ఆస్పత్రికి ఎంతఇచ్చారన్నది చెప్పాలని కోరినా ఆరోగ్యశ్రీ ట్రస్టు పట్టించుకోవడం లేదని నెట్వర్క్ హాస్పి టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నా రు. రూ.1,500 కోట్ల బకాయిలుఉన్నాయని, ప్రభుత్వం మాత్రం రూ.590 కోట్లుమాత్రమే ఉన్నాయని అంటోందన్నారు.అన్ని దశల్లో బకాయిలు..ఆస్పత్రికి రోగి వచ్చినప్పటి నుంచి చికిత్స పూర్తయ్యేదాకా హాస్పిటల్ కు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డుకు మధ్యఏడు దశల లింక్ ఉంటుం దని హాస్పి టల్స్ ప్రతినిధులు అంటున్నా రు. ఒక్కో దశలో చికిత్సఖర్చును లెక్కిస్తూ, అనుమతులిస్తూ చివరకు డబ్బులుమంజూరు చేయాలని.. చివరి దశలో ఉన్న బకాయిలురూ.590 కోట్లు అని మంత్రి చెప్తున్నా రనివివరిస్తున్నా రు. అయితే అన్ని దశల్లో ఉన్న బకాయిలవివరాలు ఇవ్వాలని కోరుతున్నారు.
తొలి నుం చీపద్ధతి ప్రకారం నిధులు విడుదల చేయాలని, పారద-ర్శకత పాటించాలని, డబ్బులు ఏ ఆస్పత్రికి రిలీజ్ చేస్తున్నారో వివరాలివ్వా లని అడుగుతున్నా ట్రస్ట్ ఒప్పుకోవడం లేదంటున్నారు హాస్పిటల్ నెట్ వర్క్ ప్రతినిధులు. సక్రమంగానే డబ్బులు ఇస్తున్నప్పుడు గోప్యత ఎందుకని నిలదీస్తున్నా రు. సీఈవో నియామకమెప్పుడు? ఆరోగ్యశ్రీకి పూర్తి స్థాయి సీఈవోను నియమిం చడంలోప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలున్నాయి.హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న మాణిక్కరాజ్ ఒక్కరేతన బాధ్యతలతోపాటు ఆరోగ్యశ్రీ సీఈవోగానూ, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ గానూ ఇన్ చార్జి బాధ్యతలునిర్వర్తిస్తున్నా రు. దీం తో ఆయన్ను కలిసేం దుకు కష్టమవుతోందని హాస్పి టళ్ల యాజమాన్యాలు చెప్తున్నా యి. బకాయిలు, ఇతర వివరాల కోసం ట్రస్ట్వద్ద వెళితే సమాధానం ఇచ్చేవారే లేరంటున్నాయి. ఇకనైనా సొమ్మును సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా యి.