బీఆర్ఎస్కు ఆరూరి రమేష్ రాజీనామా

బీఆర్ఎస్కు ఆరూరి రమేష్ రాజీనామా

బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చారు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.  పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు.  పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లకు ఆరూరి లేఖలో ధన్యవాదాలు తెలిపారు.   తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.  ఇన్నాల్లూ తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా మూడు రోజుల క్రితం ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్డుకుని మాజీ సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. దీంతో ఆయన మీడియాతో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.  కాగా అరూరి రమేష్ త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీగా అవకాశం ఇవ్వనున్నట్లుగా సమాచారం.