ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్ ల పరంపర కొనసాగుతోంది. దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ క్రమంలో డిస్నీ కంపెనీ కూడా మరోసారి లేఆఫ్ లు ప్రకటించింది. ఆ కంపెనీ నుంచి దాదాపు 4వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్నీ సంస్థ పేర్కొంది.
ఈ లేఆఫ్ ప్రక్రియ వల్ల డిస్నీ సంస్థకు దాదాపు 5.5 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుందని తెలిపింది. ఈ లేఆఫ్ వల్ల సీనియర్ ఎంప్లాయిస్ వాళ్ల సామర్థ్యానికి తగ్గట్టు పనిచేస్తారని, వాళ్ల స్కిల్స్ ను బయటపెడతారని డిస్నీ తెలిపింది. ఈ లేఆఫ్ బాధితులు బర్బాంక్, కాలిఫోర్నియా, న్యూయార్క్, కనెక్టికట్ ల్లో జరుగనున్నాయి. తర్వాత మిగతా దేశాల్లో లేఆఫ్ లు ప్రకటిస్తారు.
