రామగుండంలో 80 వేల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండంలో 80 వేల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
  • నివారించేలా బీఎల్​ఓలు, బీఎల్​ఏలు పనిచేయాలి: ఎమ్మెల్యే రాజ్ ​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో సుమారు 80 వేల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి బూత్ లెవల్ అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి, వాటిని నింపడంలో అవగాహన కల్పించాలన్నారు. గురువారం ఎన్టీపీసీలోని కాకతీయ కళాతోరణం హాల్​లో ‘సర్’ ప్రక్రియపై బీఎల్​ఓలు, బీఎల్​ఏల పనితీరు గురించి జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి గల్లంతు కాకుండా కాపాడాలన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, సమర్థవంతుడైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మేయర్​మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్​ పాతపల్లి ఎల్లయ్య, అడిషనల్​ కలెక్టర్ జె.అరుణశ్రీ, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానిక ఎన్టీపీసీ శాలపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్​ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిల్లులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులను విడుదల చేసి పనులను మళ్లీ ప్రారంభించామని చెప్పారు. పనులు స్పీడప్​ చేసి అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.  ఆయన వెంట కాంగ్రెస్​ నేతలు ఉన్నారు.