కొమురవెళ్లిలో పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి

 కొమురవెళ్లిలో పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి

మహాశివరాత్రి సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లిలో ఆలయ తోటబావి దగ్గర నిర్వహించే పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సంప్రదాయం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మల్లన్న గర్భగుడిలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. అదే సమయంలో ఆలయ తోటబావి ప్రాగణంలో ఒగ్గుపూజరులు పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి, సున్నేరుతో స్వామి వారికి పెద్ద పట్నాన్ని 41 వరుసల్లో వేస్తారు. ఈ పట్నాన్ని భక్తులు చూడడానికి వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం:

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం