అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్ పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు : మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్‌ వైపు అక్రమంగా పశువులను తరలిస్తున్న మినీ వ్యాన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. చింతలమానేపల్లి మండలం గూడెం అంతరాష్ట్ర బ్రిడ్జి దగ్గర తనిఖీలు చేస్తుండగా అక్రమంగా 10 పశువులను తరలిస్తున్న ఓ వ్యాన్​ను పట్టుకున్నామని టాస్క్ ఫోర్స్ సీఐ రణాప్రతాప్, ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.

డ్రైవర్ నిరంజన్ శర్మ, క్లీనర్ మదన్ సాకేత్ ను విచారించగా బెజ్జూర్‌ మండలం కుకుడ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ వద్ద తాము పని చేస్తున్నట్లు చెప్పారు. వ్యాన్ ను సీజ్ చేసి, ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్​లో అప్పగించినట్లు చెప్పారు. ఇర్ఫాన్ ‌పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.