హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల అరెస్ట్

హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల అరెస్ట్

హైదరాబాద్ లో రెండు ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగులను అరెస్ట్ చేశారు పోలీసులు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీరి నుంచి లక్షా 16 వేల నగదుతో పాటు  6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆన్లైన్ యాప్స్ ద్వారా బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, ప్లేయర్స్ వైజ్ బెట్టింగ్  నిర్వహిస్తున్నారన్నారు పోలీసులు. 

మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి లక్షా 40 వేల నగదు, 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెట్టింగ్ లో పాల్గొనే వారికి యూజర్ నేమ్, పాస్ వర్డ్ క్రియేట్ చేసి ఇస్తున్నారన్నారు పోలీసులు.