మహేశ్ హత్యలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయండి

మహేశ్ హత్యలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయండి
  •     మల్కాజిగిరి డీసీపీకి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు

ఘట్ కేసర్, వెలుగు: మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్​ని హత్య చేసి అసలు నిందితుడు కౌన్సిలర్ కడపొల్ల మల్లేశ్​ను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు సుధాకర్, మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డికి ఫిర్యాదు చేశారు. మాల మహానాడు మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మహేశ్​ను గత నెల 15న దారుణంగా హత్య చేసిన ప్రధాన సూత్రధారుడిని కాకుండా, అనుచరులను మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు.

 కౌన్సిలర్ మల్లేశ్​కు  మహేశ్​ కు మధ్య భూ వివాదం ఉందని, అందుకే అడ్డు తొలగించుకుంటే ఆస్తి సొంతమవుతుందని కుట్రపన్ని హత్యచేశారని పేర్కొన్నారు. పూర్తి విచారణ జరిపి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  డీసీపీకి వినతిపత్రం ఇచ్చినవారిలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగరావు, చంద్రశేఖర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, మృతుడి తల్లి మైసమ్మ, సోదరుడు విఠల్, నేతలు నాగరాజ్, సంజీవ తదితరులు ఉన్నారు.