మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డికి అరెస్ట్ వారెంట్

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డికి అరెస్ట్ వారెంట్
  • ఓ కేసులో జారీ చేసి చత్తీస్ గఢ్ లో కాంకేర్ జిల్లా సెషన్స్ కోర్టు
  • మంథని జిల్లా శాస్త్రులపల్లిలో ఆయన ఇంటికి నోటీసులు అంటించిన కాంకేర్ పోలీసులు  

మంథని, వెలుగు: మావోయిస్టు అగ్రనేతకు చత్తీస్ గఢ్ లోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ లక్ష్మణ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బుధవారం కాంకేర్ ఎస్ఐ ఆర్ కే సేతీయ, కానిస్టేబుల్ మనోహర్ కలిసి మావోయిస్టు నేత రాజిరెడ్డి సొంతూరుకు వెళ్లారు. 

అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసు అంటించారు. అనంతరం పంచాయతీ ఆఫీసులోనూ అందజేశారు. ఆ తర్వాత మంథని ప్రెస్ క్లబ్ లో మీడియాతో కాంకేర్ పోలీసులు మాట్లాడారు. రాజిరెడ్డిపై క్రైమ్ నంబర్ 09/2025 ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు కాంకేర్ జిల్లా సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని తెలిపారు. వచ్చే నెల 11న కోర్టులో తప్పక హాజరు కావాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.