
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ విశ్వేశ్వరయ్య భవన్‌లో శుక్రవారం అసోషియేషన్ ఆఫ్ రేడియేషన్ థెరపిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఏఆర్టీటీఐ) ఆధ్వర్యంలో ఆర్టికాన్–2025 సదస్సు జరిగింది. నిమ్స్ డైరెక్టర్ ప్రొ. నగరి బీరప్ప, సింధు హాస్పిటల్ డైరెక్టర్ డా. ఎం. బాబయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
రేడియేషన్ థెరపీ, ఆంకాలజీ రంగాల్లో నాలెడ్జ్ షేరింగ్, దేశ -విదేశ నిపుణుల మధ్య సహకారానికి ఈ సదస్సు వేదికగా నిలిచిందని వక్తలు అభిప్రాయపడ్డారు. రేడియేషన్ ఆంకాలజీ, థెరపీలో అభివృద్ధి గురించి చర్చలు నిర్వహించారు. దేశ-విదేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు, ప్రముఖ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ థెరపీ నిపుణులు హాజరయ్యారు.