
- నృత్య ప్రదర్శనతో అదరగొట్టిన కళాకారులు
బషీర్బాగ్, వెలుగు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తిని నృత్యరూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. గురువారం రవీంద్రభారతిలో భరతనాట్య గురువు పద్మశ్రీ డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ దర్శకత్వంలో ఈ ప్రదర్శన ఇచ్చారు. -అల్లూరి దేశభక్తిని చాటే సన్నివేశాలను ప్రదర్శించారు. 23 మంది కళాకారులతో మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్సన్నివేశాలతో రక్తి కట్టించారు.
అలాగే మినిస్టర్ ఆఫ్ కల్చర్, ఒడిశా డాన్స్ అకాడమీ(భువనేశ్వర్) ఆధ్వర్యంలో పద్మశ్రీ అరుణ మొహంతి, ఆనంద శంకర్ జయంత్ దర్శకత్వంలో ‘రసభైవా’ శీర్షికతో ఒడిశా కళాకారులు భరతనాట్యంతో అలరించారు. భగవద్గీత తత్వశాస్త్ర ప్రాముఖ్యాన్ని చూపించారు. అతిథులుగా సికా డాక్టర్ చక్రవర్తి, జి.అన్నారావు హాజరయ్యారు.