ఉద్యోగుల సమష్టి కృషితోనే అవార్డులు : అరుణ్​ కుమార్ ​జైన్​

ఉద్యోగుల సమష్టి కృషితోనే అవార్డులు : అరుణ్​ కుమార్ ​జైన్​
  •     సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్​ అరుణ్​ కుమార్​ జైన్​ 

పద్మారావునగర్, వెలుగు :​ ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషి, వృత్తి నిబద్ధతతోనే సౌత్​సెంట్రల్​ రైల్వేకు అవార్డులు, ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ అరుణ్​ కుమార్ ​జైన్​పేర్కొన్నారు. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్​సంఘ (ఎస్​సీఆర్ఈఎస్​) 32వ త్రై వార్షిక జనరల్​బాడీ సమావేశం గురువారం బోయిగూడ లోని రైల్​ కళారంగ్​ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య అతిథిగా జీఎం హాజరై మాట్లాడుతూ రైల్వే శాఖలో పారదర్శకమైన ఉత్తమ సేవలను అందిస్తున్నామన్నారు.

ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం, భద్రత సమస్యల పరిష్కారానికి  అందుబాటులో ఉంటున్నామన్నారు. రైల్వే ఎంప్లాయీస్​ సంఘ్​ జనరల్​ సెక్రటరీ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న రైల్వే కార్మికులకు, ఉద్యోగులకు పాత పెన్షన్​పద్ధతి అమలు చేయాలని, రైల్వే ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్య పెంచాలని, ఉద్యోగుల పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో చీఫ్​పర్సనల్​ఆఫీసర్​కిశోర్​బాబు, డిప్యూటీ జనరల్​మేనేజర్​శ్రీధర్, సంఘ్​ అధ్యక్షుడు ప్రభాకర్​ఆండ్రూస్​, వర్కింగ్​ ప్రెసిడెంట్ ఆదం సంతోశ్​, ఏసీఎస్​లు భరణి భాను ప్రసాద్​, రుద్దారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.