రిలయన్స్​ చేతికి అరవింద్ బ్యూటీ వ్యాపారం

రిలయన్స్​ చేతికి అరవింద్ బ్యూటీ వ్యాపారం

డీల్​ విలువ రూ. 216 కోట్లు

న్యూఢిల్లీ: లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాయ్ కుటుంబం ప్రమోట్ చేస్తున్న అరవింద్ ఫ్యాషన్  బ్యూటీ రిటైల్ వ్యాపారాన్ని (సెఫోరా) రిలయన్స్​ కొనుగోలు చేయనుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ బ్యూటీ&పర్సనల్ కేర్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్​పీఏ) కుదుర్చు కున్నామని అరవింద్ ఫ్యాషన్ శుక్రవారం తెలిపింది. 

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఎస్​పీఏ కింద ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత, అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ కంపెనీకి అనుబంధ సంస్థగా నిలిచిపోతుంది. మొత్తం ఈక్విటీ వాటాను అమ్మడం, అప్పుల చెల్లింపు కోసం రూ. 216 కోట్ల ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ విలువతో లావాదేవీ జరిగింది. ఈక్విటీ వాటా విక్రయానికి సంబంధించి కొనుగోలు పరిశీలన (పర్చేజ్​కన్సిడరేషన్​) రూ. 99.02 కోట్లు. అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 336.70 కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించింది. 

అరవింద్ ఫ్యాషన్స్ కన్సాలిడేటెడ్​ ఆదాయంలో ఇది 7.60 శాతం. రిలయన్స్ రిటైల్ ఇది వరకే ‘తీరా’ బ్రాండ్​తో బ్యూటీ వ్యాపారంలోకి ప్రవేశించింది.   రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్ పీక్ ఎక్స్​వీ (గతంలో సికోవియా క్యాపిటల్ ఇండియా, ఆగ్నేయాసియా) రిపోర్ట్​ ప్రకారం - భారతీయ బ్యూటీ, పర్సనల్​ కేర్​ మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్​ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఇండియన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ (బీపీ) మార్కెట్-- విలువను 2022లో సుమారు 19 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.