
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కరోనా టెస్టులు చేయించుకోనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఆదివారం నుంచి గొంతు నొప్పితోపాటు ఫీవర్ లక్షణాలతో కేజ్రీవాల్ బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా వైరస్ భయపెడుతున్న దృష్ట్యా కేజ్రీవాల్ టెస్టులు చేయించుకోనున్నారని తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం అన్ని మీటింగ్స్‌ను కేజ్రీ క్యాన్సిల్ చేశారని.. అలాగే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. చివరగా సండే సాయంత్రం ఆన్‌లైన్ మీడియా బ్రీఫింగ్‌లో ఆయన కనిపించారు. కాగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 28,936కు చేరుకోగా.. మహమ్మారి బారిన పడి 812 మంది చనిపోయారు.