ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ రేపటికి వాయిదా

ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ  రేపటికి వాయిదా

డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌కు బెయిల్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతుందని  న్యాయమూర్తి జస్టిస్ సాంబ్రే తెలిపారు. బాంబే హైకోర్టులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. గురువారం ఎన్సీబీ తరపున కోర్టులో వాదనలు విన్పిస్తారు.

ఆర్యన్ తరపున రెండో రోజు కూడా మాజీ అటార్నీ జనరల్,సీనియర్ న్యాయవాది  ముకుల్ రోహిత్గీ కోర్టులో వాదనలు విన్పించారు. ఈ కేసులో ఆర్యన్‌తో పాటు అరెస్టైన అతడి ఫ్రెండ్‌ ఆర్భాజ్‌ తరపున వాదనలు విన్పించారు ప్రముఖ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌, మూన్ మూన్ ధమేచా తరపున అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ ముఖ్ వాదించారు. ఈ కేసులో వారిని చట్ట విరుద్దంగా అరెస్ట్‌ చేశారని వాదించారు. 

ముంబై క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో  ఎన్సీబీ అధికారులు ఇచ్చిన అరెస్టు మెమోలో..అరెస్టుకు  సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని ముకుల్ రోహిత్గి కోర్టుకు తెలిపారు. ఆర్యన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆదారాలు లేవన్నారు.