ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారా!

ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో  కావాలనే ఇరికించారా!

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక విషయాలు వెల్లడించింది. కేసు దర్యాప్తులో అనేక అక్రమాలను గుర్తించినట్లు పేర్కొంది. సుమారు ఎనిమిది మంది అధికారుల ప్రవర్తన అనుమానంగా ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తో పాటు, 8 మంది అధికారుల పై 3వేల పేజీల ఛార్జిషీట్ ను ఎన్ సీబీ అధికారులు సిద్ధం చేశారు. కోర్డెలియా క్రూయిజ్ షిప్ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 15 మందిని 2021 అక్టోబర్ 3న ఎన్‌సిబి అరెస్టు చేసింది. సుమారు మూడు వారాల పాటు జైలులో గడిపిన తర్వాత అన్నింటిని ఎత్తివేసింది.  ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేశారు.

ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో అధికారులు అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి... ప్రత్యేక దర్యాప్తు బృందం తన విజిలెన్స్ నివేదికను ఢిల్లీలోని ప్రధాన కార్యాయానికి అందించింది. దీనిలో 65 మంది వాంగ్మూలాలు రికార్డు చేసుకోగా, కొందరు మూడు నుంచి నాలుగు సార్లు వాంగ్మూలాలు మార్చినట్లు పేర్కొంది. కాగా, గతంలో జరిగిన విచారణ ఎంపిక చేసుకున్న వ్యక్తులపై ఉద్దేశ్యపూర్వకంగా సాగినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అనుమానాస్పదంగా వ్యవహించిన అధికారుల పై చర్యలు తీసుకునేందుకు సీనియర్ల నుంచి అనుమతి రావాల్సి ఉందని పేర్కొన్నారు. గత నెల అక్టోబర్‌లో క్రూయిజ్ షిప్ పార్టీలో డ్రగ్స్ వాడారనే ఆరోపణలపై అరెస్టైన 20 మందిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు.