ఆక్వాటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‎ హీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆర్యన్, లిఖిత్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆక్వాటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‎ హీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆర్యన్, లిఖిత్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సింగపూర్: ప్రతిష్టాత్మక వరల్డ్ ఆక్వాటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్విమ్మర్లు  ఆర్యన్ నెహ్రా, ఎస్.పి. లిఖిత్ నిరాశపరిచారు. ఆదివారం జరిగిన పోటీల్లో ఫైనల్ చేరలేకపోయిన ఇద్దరూ హీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరిగారు.  మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో ఆర్యన్ నెహ్రా 4 నిమిషాల 00.39 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తన హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడో స్థానం, ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  37వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. 

ఈ పోటీలో టాప్-8 స్విమ్మర్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించగా ఆర్యన్ ఇంటిదారి పట్టాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌100 మీటర్ల బ్రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిఖిత్ 1 నిమిషం 01.99 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొత్తంగా 40వ స్థానంతో నిరాశ పరిచాడు. టాప్-–16 స్విమ్మర్లు సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు.