
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీనియర్ ఇన్‌లైన్ హాకీ టీమ్‌కు సిటీకి యంగ్ స్టర్ ఆర్యన్ కర్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 11 నుంచి 25 వరకు చండీగఢ్‌లో జరిగే నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ ఇన్‌లైన్ హాకీ టీమ్‌ను ఆర్యన్ నడిపించనున్నాడు. ఈ మేరకు టోర్నీలో పాల్గొనే స్టేట్ టీమ్‌ను శుక్రవారం ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఆర్యన్‌తో పాటు తరుణ్ తేజ, భార్గవ రాకేశ్, శివ సుబ్రమణ్యం, గుమ్మడి భరత్, సయ్యెద్ గౌస్, సాయి కుమార్, మణికంఠ,
కె. భరత్ ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి సాయి విజ్ఞేష్ చోటు దక్కించుకోగా, జానకి రామ్ (మహబూబ్ నగర్), సృజన్ రెడ్డి (కరీంనగర్) కూడా ఎంపికయ్యారు.