ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ షాక్

ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ షాక్

ట్విట్టర్ టేక్ ఓవర్ చేసిన దగ్గరనుంచి ఎలన్ మస్క్ ట్విట్టర్ డెవలప్మెంట్ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్విట్టర్ ని టాప్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి అన్నీ రంగాలను సిద్ధం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ట్విట్టర్ ఉద్యోగులకు మరొక షాక్ ఇచ్చాడు మస్క్.

మేక్ ఆర్ బ్రేక్ మ్యాటర్ గా ప్రతీ ఉద్యోగి వారంలో ఏడు రోజులు, రోజులో 12 గంటలు పనిచేయాలని మస్క్ ట్విట్టర్ టీంకి సూచించాడు. ఉద్యోగులకి టాస్క్ లు ఇచ్చి, వాటిని టైంకల్లా పూర్తి చేయాలని చెప్పాడు. ఒకవేళ ఏ ఉద్యోగి తన పని చేయలేకపోయినా, టైమింగ్స్ పాటించకపోయినా, నచ్చకపోయినా ఉద్యోగాల నుంచి తీసేయనున్నట్టు చెప్తున్నాడు మస్క్. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులపై అధిక పని భారం పడనుంది. అంతేకాకుండా ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్నవాళ్లు మళ్లీ రీ వెరిఫికేషన్ చేసుకోవాలని యూజర్లకు సూచించాడు.